Konte Chooputho Song Lyrics In Telugu
Singers: Belly Raja, Deepa
Lyrics : Vennelakanti
Music : James Vasanthan
Konte Chooputho Lyrics In Telugu
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
పగలే రేయైనా యుగమే క్షణమైనా కాలం నీ తోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మోమాటమిది
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే
కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచినే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కంటి చూపుతో నీ కంటి చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే
ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే
0 Comments
If You Have Any Query Please Let Me Know
Emoji